షార్ట్ సర్క్యూట్ తో షాపు దగ్ధం
అనంతపురం : పెనుకొండ లోని కృష్ణదేవరాయ రోడ్ లో వున్న ఎలక్ట్రికల్ షాపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంగళవారం రాత్రి దగ్ధమైంది. మంగళవారం షాపుకు సెలవు కావడంతో షాపు యజమాని ఇంటి వద్దనే ఉన్నారు. షాపులో నుండి మంటల వెలువడడం గమనించిన కొందరు వ్యక్తులు షాపు యజమానికి, అగ్నిమాపక సిబ్బందికి తెలిపారు. యజమాని షాపు దగ్గరకు వచ్చిన కొంత సేపటికే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు భావిస్తున్నారు.
News Posted: 15 April, 2009
|