చిన్నారులతో ఆలీ ముచ్చట్లు
రాజమండ్రి : తిలక్ రోడ్ లోని సంహిత న్యూ జనరేషన్ ఎ.సి.స్కూలు ప్రారంభోత్సవానికి ప్రముఖ హాస్య నటుడు ఆలి విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన ఆటాడుకుందాం రా అంటూ చిన్నారులతో కలిసి తాను చిన్న పిల్లాడైపోయాడు. తదుపరి స్కూల్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటికీ చిన్నపిల్లాడినే అని అన్నారు. ఆయన కొద్దిసేపు చిన్నారులతో ముచ్చటించాడు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జక్కంపూడి రాజా ఇంద్రవందిత్, సంహిత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, సంస్థ చైర్మన్, సి.ఇ.ఒ, కో ఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు.
News Posted: 12 May, 2009
|