కాకినాడ : భారీ వర్షానికి నగరంలో పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. దీనికి తోడు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంబాలు నేలకొరగడంతో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కాకినాడలో అంధకారం అలుముకుంది.