బొమ్మన హాల్ లో ఇద్దరి హత్య
అనంతపురం: గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులును హతమార్చిన సంఘటన అనంతపురం జిల్లా బొమ్మన హాల్ లో చోటుచేసుకుంది. మృతి చెందిన వారిని డ్రైవర్, క్లీనర్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు. హత్య చేసిన వెంటనే అక్కడే ఉన్న వారి టిప్పర్ ను దుండగులు తీసుకెళ్లినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.
News Posted: 6 June, 2009
|