ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం
హైదరాబాద్ : కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాయలసీమ హక్కుల సంఘం అధ్యక్షుడు టి.జి.వెంకటేష్ కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. షాద్ నగర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్దింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో వెంకటేష్ కు ప్రమాదం తప్పింది. కారు మాత్రం స్వల్పంగా దెబ్బతిన్నది.
News Posted: 8 June, 2009
|