వరంగల్ : జిల్లాలోని ఓ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటున్న ఇంజనీర్ ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రోడ్డు పనుల ఉత్తర్వుల నిమిత్తం ఓ కాంట్రాక్టర్ ను 7500 లంచం కావాలని ఆర్అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న సత్యనారాయణ డిమాండ్ చేశారు. దాంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు పధకం ప్రకారం ఇంజనీర్ ను పట్టుకున్నారు.