కల్తీ కారం గుట్టు రట్టు
నరసరావుపేట : కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్టుగా నరసరావు పేటలో అక్రమ వ్యాపారులు కారం పొడిలో కూడా కల్తీ కలిపి ధనార్జన చేస్తున్నవ్యాపారులను అధికారులకు పట్టుకున్నారు. నరసరావుపేట, వినుకొండ, బరం పేటలోని చాకలిమిట్ట ప్రాంతంలో ఫ్లోర్ మిల్లులపై అధికారులు తనికీలు నిర్వహించారు. దీంతో పట్టణంలో కొన్నేళ్ళుగా ఘుమఘుమ లాడే కల్తీ కారాన్ని తయారు చేస్తున్న అక్రమ వ్యాపారుల గుట్టు రట్టయింది. పనికిరాని ఎండుమిర్చి, బూజుపట్టిన చింతపండు, గేదెలకు దాణాగా వేసే చెదలు పట్టిన మినప, కందిపప్పు నూకలు, పురులు పట్టిన వెల్లులితో తయారవుతున్న కారం గుట్టుచప్పుడు కాకుండా చేతులు మారుతున్న కల్తీ కారం పొడిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ధనార్జన కోసం కల్తీ కారాన్ని, పసుపను తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న అక్రమ వ్యాపారులను చూసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. వినుకొండ రోడ్డులోని జూపల్లి సెంటర్ లోని టి.గోపాలకృష్ణ కు చెందిన తొలుత కారమం మిల్లులో తనిఖీలు జరపగా లేబుల్ లేని కారం పొట్లాలలను స్వాధీనం చేసుకుని పరిశోధనలకు పంపేందుకు నమూనాలను సేకరించారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా కల్తీ కారం పొడిని తయారు చేసి అందమైన ప్యాకింగ్ లో ప్రజలకు అమ్ముతున్న వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో పట్టణంలో తినుబండారాలు, వస్తువులు తయారు చేస్తున్న వారిపై నిఘా పెంచారు.
News Posted: 18 June, 2009
|