సెయింట్ జోసెఫ్ లో అప్రెంటీస్
కడప : ఇంటర్మీడియట్ వృత్తి విద్యాకోర్సులు పూర్తి చేసిన వారికి అప్రెంటీస్ శిక్షణ కోసం ఎంపికలు నగరంలోని మరియాపురం సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో ఈనెల 18న నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఐ.ప్రభాకర్ వెల్లడించారు. 2007 మార్చి నుంచి 2009 వరకు ఇంటర్ పూర్తి చేసినవారు శిక్షణకు అర్హులన్నారు. బుధవారం సాయంత్రం ఆయన ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. విద్యార్థులు అన్ని రకాల ఒరిజినల్ అర్హతా పత్రాలతో పాటు మరో రెండు జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్టు సైజు పోటోలతో రావాలన్నారు. ఓఏ, ఎంపీ హెచ్ డబ్ల్యూ , పిటీ, ఎక్సరే, ఏఈటీ, ఈఈటీ, సీఎస్ఈ, జీసీడీఎం, సీటీ, సీజీఏ, ఏ అంట్ టీ, ఈడబ్ల్యూఎస్ ఈఏ, ఆర్ అండ్ టీవీ, ఓటీ, ఈసీజీ, టెక్నీషియన్, ఆడియోమెట్రిక్, వాటర్ సప్లై అండ్ శానిటరీ గ్రూప్స్ చదివినవారు శిక్షణకు రావాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1400 ఉపకార వేతనం అందుతుందన్నారు. విద్యార్థులు, కడప, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో శిక్షణ పొందాల్సి ఉంటుందన్నారు. వృత్తి విద్యాకోర్సులు పూర్తి చేసి ఇందులో శిక్షణ పొందితేనే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులన్నారు. వివరాలకు ఎస్టీ జోసెఫ్ కళాశాల ఫోన్ 08562-241223, జిల్లా వృత్తి విద్యాధికారి కార్యాలయం 254666, ఆర్జేడీ కార్యాలయం 258220 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.
News Posted: 16 July, 2009
|