ఎన్ఐసి బిల్డింగ్ లో అగ్నిప్రమాదం
వరంగల్ : ఎన్ఐసి బిల్డింగ్ లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్ఐసి బిల్డింగ్ లో సంభవించిన ఈ ప్రమాదంలో కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
News Posted: 31 July, 2009
|