తెరాస పదవికి సుదర్శన్ గుడ్ బై
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి పెద్ది సుదర్శన్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు శనివారంనాడు ఫ్యాక్స్ లో తన రాజీనామా లేఖను సుదర్శన్ రెడ్డి పంపించారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ తాను సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక వైపున పార్టీ కేంద్ర కమిటీ హైదరాబాద్ లో పార్టీ వ్యవహారాలపై చర్చించేందుకు సమావేశం కావడానికి కొంత సేపు ముందర సుదర్శన్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం విశేషం. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పడం గమనార్హం. పార్టీలోని కొందరు నాయకుల వైఖరి నచ్చకపోవడం వల్లే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు సుదర్శన్ రెడ్డి స్పష్టంచేశారు.
News Posted: 1 August, 2009
|