విద్యార్థినిపై ప్రేమ్మోన్మాది దాడి
కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పట్టణంలోని ఆల్ఫా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినిపై ప్రేమ్మోన్మాది దాడి చేసి గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులపై ప్రేమ్మోన్మాది దాడులు ఆగడం లేదు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్నూలులో తనను ప్రేమించడం లేదంటూ ఓ ప్రేమోన్మాది ఆల్ఫా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని మాధురి గొంతు కోసిన ఈ సంఘటనే ఉదాహణ. ఆల్ఫా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఆస్పత్రివద్దకు చేరుకుని నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
News Posted: 1 August, 2009
|