గుంటూరు : గుంటూరు జిల్లాలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో బకెట్లకొద్దీ నాటు బాంబులు బయటపడుతున్నాయి. బుధవారం గ్రామంలో గొల్లపల్లి మండలం గరికపాడులో పోలీసులు సోదాలు నిర్వహించగా బయట పడిన నాటు బాంబులను వారు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న బాంబులను నిర్వీర్యం చేస్తున్నారు.