గుంటూరు : గుంటూరు జిల్లాలో ఓ ఎలక్ట్రికల్ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జిన్నా టవర్సెంటర్లోని విజయా ఎంటర్‌ప్రైజెస్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో షాపులోని వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.