భారీ మావోయిస్టు డంప్ లభ్యం
వరంగల్: వరంగల్ జిల్లాలోని వెంకటాపురం అడవుల్లో భారీ మావోయిస్టు డంప్ బయట పడింది. జిల్లాలోని వెంకటాపురం మండలం నారాయణపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఈ డంప్ లభ్యమైంది. జనశక్తి గ్రూప్ నకు చెందినదిగా భావిస్తున్న ఈ డంప్ లో 475 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 39 జిలెటిన్ స్టిక్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అడవుల్లో నిర్వహిస్తున్న కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది.
News Posted: 25 August, 2009
|