శ్రీకాళహస్తిలో పవిత్రోత్సవాలు
తిరుపతి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ సోమవారం నుంచి పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఏడాది కాలం పాటు ఆలయంలో జరిగే సేవల్లో తెలిసో, తెలియకో జరిగే తప్పులను సవరించుకునేందుకుగాను పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలు జరపడానికి అన్ని ఏర్పార్లు చేసినట్లు అధికారులు తెలియజేశారు.
News Posted: 31 August, 2009
|