పాలిటెక్నిక్ కు స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి : తిరుపతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 10వ తేదీన పాలిటెక్నిక్ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరన్ తెలిపారు. అలానే చంద్రగిరిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా అదే రోజు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని వివరించారు. మిగిలిపోయిన సీట్లను భర్తీచేసేందుకు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ ఏడాది నుంచి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. అడ్మిషన్ల దరఖాస్తులను మంగళ, బుధ వారాల్లో కళాశాల కార్యాలయాల నుంచి పొందవచ్చన్నారు. గురువారం ఉదయం 11 గంటలకు అడ్మిషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. సీప్-2009లో ర్యాంకులు సాధించినవారు, ర్యాంక్ లు సాధించకపోయినా 10 తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. మరిన్ని వివరాలకు 9959338991 సెల్ నంబర్ కు ఫోన్ చేసి సంప్రదింవచ్చని ఆయన తెలిపారు.
News Posted: 8 September, 2009
|