అనంతపురం : విజయదశమి పండుగ సందర్భంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో శ్రీమత్కన్యకాపరమేశ్వరిదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నవరాత్రులలో రెండవ రోజైన ఆదివారం అమ్మవారిని శ్రీగాయిత్రీదేవిగా అలంకరించారు. ఈఉత్సవా లను పురస్కరించుకుని ఆర్య వైశ్య సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఆలయం సమీపంలో భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు.