విజయవాడ : విజయవాడ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గా ఫిలిప్స్ గ్రిటన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర పాలక సంస్థలో డిప్యూటీ మేయర్ ఎన్నిక బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరిగింది. ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.