శ్రీశైలంలోకి వరద తగ్గుముఖం
కర్నూలు : శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయానికి 891.69 అడుగుల ఎత్తులో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం నమోదై ఉంది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 7.32 లక్షల క్యూసెక్కులు వస్తోంది. అవుట్ ఫ్లో 13.74 లక్షల క్యూసెక్కులు ఉంది. నాగార్జునసాగర్ నీటిమట్టం 588 అడుగుల ఉంది. ఇన్ ఫ్లో 11.36 లక్షల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు ఉంది.
News Posted: 5 October, 2009
|