కాకినాడ : నగరం చుట్టుపక్కల 37 గ్రామ పంచాయితీలను మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయవద్దంటూ ఆ గ్రామాల సర్పంచ్ లు కార్పోరేషన్ ఎదుట బైటాయించారు. ఈ సర్పంచ్ లకు శాసనసభ్యుడు కన్నబాబు కూడా తన మద్దతు తెలిపారు. గ్రామ పంచాయితీలను మున్సిపల్ కార్పోరేషన్ లో విలీనం చేయాలని కార్పోరేషన్ సమావేశంలో తీర్మానించడంతో సర్పంచ్ లు కార్పోరేషన్ ఎదుట ధర్నాకు దిగారు.