నగరంలో కన్నడ ఫుడ్ ఫెస్టివల్
విశాఖపట్నం : కర్ణాటక సాంప్రదాయ వంటకాలను విశాఖ ప్రజలకు అందించేందుకు వెల్ కం హోటల్ గ్రాండ్ బే ముస్తాబయింది. నేటి నుంచి నవంబర్ ఎనిమిది వరకు కన్నడ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించనుంది. గ్రాండ్ బేలోని దక్షిణ రెస్టారెంట్ లో గురువారం మధ్యాహ్నం నుంచి ఈ ఫుడ్ అందుబాటులో ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా గల తమ హోటళ్ళలో ప్రతినెల అతిథుల సౌకర్యార్ధం ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా కర్ణాటక ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎఫ్ అండ్ బి మేనేజర్ కెనన్, ఎగ్జిక్యూటీవ్ చెఫ్ వీరేంద్ర శర్మ తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ను ఉడిపి, మంగళూర్, కొడుగు, మల్ నడ్ వంటి ప్రాంతాల్లో లభ్యమయ్యే ప్రత్యేక రుచులను నగరవాసులకు అందిస్తామన్నారు.
News Posted: 29 October, 2009
|