నెల్లూరులో భారీ వర్షాలు
నెల్లూరు : నెల్లురు జిల్లాలో కుండపోతగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నెల్లూరు జిల్లా జనజీవనం స్థంభించిపోయింది. డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేనందున లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో చెనై, నెల్లూరు మధ్య రాకపోకలు స్థంభించి పోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
News Posted: 7 November, 2009
|