విజయవాడ : వికాస్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని రేణుక సోమవారం అర్థరాత్రి హాస్టల్ రెండవ అంతస్తు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నున్నకు చెందిన రేణుక జిల్లాలోని విస్సన్న పేటలోని వికాశ్ కళాశాలలో చుదువుకుంటోంది. రేణుక కాలేజ్ భవనం పై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో సహ విద్యార్థులు వెంటనే రేణుకను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రేణుక మృతి చెందింది. ప్రేమ విఫలం కావడం వల్లే రేణుక ఆత్మహత్యకు పూనుకున్నట్లు సమాచారం.