కోడెల పరిస్థితి ఆందోళకరం
గుంటూరు : సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆరోగ్య పరిస్థితి బుధవారం ఆందోళకరంగా మారింది. ఆయనతో పాటు దీక్షలో ఉన్న పత్తిపాటి పుల్లారావు, ఆంజనేయులు ఆరోగ్యాలు కూడా బాగా క్షీణించాయని వైద్యులు వెల్లడించారు. కోడెల తదితరులకు కామెర్లు సోకే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే సమాజ్ వాది పార్టీ నాయకులు సురేష్, బాబూరావులకు కూడా కామెర్లు వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయని వారు తెలిపారు.
News Posted: 23 December, 2009
|