ఎస్సై రంగనాథ్ కు వారెంట్r
గుంటూరు : రజియా సుల్తానా కేసుకు సంబంధించి విధుల నుంచి సస్పెండ్ అయిన ఎస్సై రంగనాథ్ గౌడ్ పై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రజియా సుల్తానా కేసు విచారణకు సంబంధించి రంగనాథ్ గౌడ్ మంగళవారం నాడు పొన్నూరు కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, రంగనాథ్ గౌడ్ కోర్టుకు గైర్హాజరయ్యారు. దీనితో కోర్టు న్యాయమూర్తి రంగనాథ్ గౌడ్ ను అరెస్ట్ చేయాలంటూ అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు.
News Posted: 28 December, 2009
|