పిఎస్ లో ఆత్మహత్యా యత్నం
గుంటూరు : పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు యువకులు గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నం చేశారు. జిల్లాలోని వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు యువకులు బ్లేడ్ తో తమ గొంతులు కోసుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారని, ఆ అవమానం భరించలేకే తాము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని యువకులు తెలిపారు. దొంగతనం రికవరీ కేసులో వినుకొండ పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని, స్టేషన్ లో పెట్టి ప్రశ్నిస్తున్నారు.
News Posted: 29 December, 2009
|