ఆంధ్రాబ్యాంక్ స్కూలు
విశాఖపట్నం : ఆంధ్రాయూనివర్శిటీలో ఆంధ్రబ్యాంక్ స్కూలు ఆఫ్ బిజినెస్ విభాగం ఏర్పాటవుతోంది. గతంలో ఏయూ, ఆంధ్రాబ్యాంక్ ల మధ్య ఈ మేరకు పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. ఈ మేరకు బిజినెస్ స్కూలు నిర్మాణానికి చెరో రెండు కోట్ల చొప్పున వెచ్చిస్తున్నాయి. స్కూలు నిర్వహణ తదితర విషయాలన్నీ ఏయూ కామర్స్ విభాగం పర్యవేక్షిస్తుంది. ఈ ఏడాది నవంబర్ కల్లా పనులు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కామర్స్ విభాగాధిపతి బి అప్పారావు చెప్పారు.
News Posted: 9 January, 2010
|