విజయవాడ : మహిళలను అలరించే లేటెస్ట్ మోడళ్ల అలంకరణ వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు సత్యనారాయణ చెప్పారు. ఉమెన్స్ లగ్జరీ ఫెయిర్ - 2010 పేరిట నిర్వహించే ఈ ప్రదర్శనను జనవరి 9 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రా నుంచి ఎన్నో రకాల వస్త్రాలను ఇందులో ప్రదర్శిస్తామని వివరించారు.