సీడీ షాపులపై దాడి
తిరుపతి : తిరుపతి నగరంలోని పలు సీడీ షాపులపై పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. సుమారు 50 వేల రూపాయల విలువైన సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్, వెస్ట్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఏకకాలంలో అన్ని షాపువపైనా దాడులు జరిపారు. ఈ దాడుల్లో నూతనంగా విడుదలైన ఆదుర్స్, శంభో శివ శంభో, నమో వెంకటేశ వంటి చిత్రాల పైరసీ సీడీలు, అశ్లీల సీడీలు కూడా లభించడంతో పోలీసులు వాటిని సీజ్ చేసారు.
News Posted: 21 January, 2010
|