నగర పంచాయితీగా పత్తికొండ
కర్నూలు : పత్తికొండ గ్రామ పంచాయతీకి నగర పంచాయతీ హోదా లభించనుంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. నగర పంచాయతీకైతే 20 వేల జనాభా కంటే అధికంగా ఉండటం, గత మూడు సంవత్సరాల ఆదాయ వివరాలు, విస్తీర్ణం, జన సాంద్రత, ఉద్యోగుల శాతం తదితర వివరాలు పంపాలని పేర్కొన్నారు. నగర పంచాయతీ హోదా దక్కితే మోలిక వసతుల కల్పనకు, పారిశుద్ధ్యం తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ కోసం కోట్లాది రూపాయలు మంజూరయ్యే అవకాశం ఉంది.
News Posted: 22 January, 2010
|