గుమ్మడికి అంతిమ వీడ్కోలు
గుంటూరు : రెండు రోజుల క్రితం కన్నుమూసిన సినీ నటుడు గుమ్మడి అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. ఆయన స్వస్థలం రావికంపాడులో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీ పరిశ్రమ వర్గాలు అంత్యక్రియలకు హాజరై గుమ్మడికి అంతిమ వీడ్కోలు పలికారు. గుమ్మడితో తమకున్న అనుబంధాన్ని అంతా నెమరు వేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
News Posted: 28 January, 2010
|