పలగాని కుమార్తె కిడ్నాప్
విజయవాడ : నగరంలో శనివారం సినీ ఫక్కీలో కిడ్నాప్ జరిగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త పలగాని ప్రభాకర్ కుమార్తెను దుండగులు కిడ్నాప్ చేసారు. ప్రభాకర్ తన కుమార్తె, కుమారుడు తో కలసి శనివారంలో కారులో బయలు దేరారు. దారిలో కారును అడ్డగించి దాడి చేసారు. అడ్డుకున్న కారు డ్రైవర్ ను దుండగులు కత్తితో పోడిచి హత్య చేసారు. ప్రభాకర్ కుమారుడు తప్పించుకోగా, కుమార్తెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటనలో ప్రభాకర్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దుండగులు నలుపు రంగు టవేరా కారులో పరారైనట్లు సమాచారం.
News Posted: 30 January, 2010
|