సమ్మక్క జాతరలో 'గుస్సాడి'
వరంగల్ : గిరిజన దేవతలు సమ్మక్క - సారలమ్మ జాతర సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన గుస్సాడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 18 మంది గోండు కళాకారుల బృందం, గిరిజన సంక్షేమ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. గుస్సాడి నృత్యాన్ని తిలకించిన భక్తులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఈ నృత్యం ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు మాత్రమే పరిచయమైన గుస్సాడి నృత్యాన్ని చూసిన ఇతర జిల్లాల వారు, రాష్ట్రాల భక్తుల ఆనందానికి అవధులు లేవు. ప్రత్యేకంగా పొదిగిన నెమలిపింఛాలను తలపై ధరించడం, కొమ్ము బూర సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయడం గుస్సాడి నృత్యంలోని ప్రత్యేకత. గుస్సాడి నృత్యం ముగిసిన తరువాత కళాకారులతో ఫొటోలు తీయించుకునేందుకు అధికారులు, భక్తులు పోటీలు పడ్డారు.
News Posted: 30 January, 2010
|