బాటా షోరూం దగ్ధం
విశాఖపట్నం : నగరంలోని ద్వారకానగర్ ఉన్న బాటా షోరూంలో శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఉవ్వెత్తున ఎగసిపడడంతో షోరూం పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు కూడా వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో పక్క దుకాణాలకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా స్తంభించిపోయింది. ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన చెప్పులు, షూస్, ఫర్నీచర్ దగ్ధం అయిపోయాయి. బాటా షోరూం పై అంతస్తులో ఉన్న లాడ్జిలోకి కూడా మంటలు వ్యాపించాయి. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతుండడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఎంతగా ప్రయత్నిస్తున్నా అదుపులోకి రావడం లేదు. ఈ అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం అని ప్రాథమికంగా తెలుస్తోంది.
News Posted: 12 February, 2010
|