జగదాంబ జగదీష్ అరెస్ట్
విశాఖపట్నం : నిత్య పెళ్లి కొడుకు అవతారమెత్తి పలువురు మహిళలను మోసం చేసిన కేసులో జగదాంబ థియేటర్ యజమాని కుమారుడు జగదీష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడలో శనివారం పోలీసులు జగదీష్ ను అదుపులోకి తీసుకున్నారు. తమను మోసం చేసాడంటూ మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటినుండి జగదీష్ విశాఖ నుండి పరారయ్యాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు తీవ్రంగా గాలించి జగదీష్ ను అరెస్ట్ చేసారు.
News Posted: 20 February, 2010
|