'స్పృహలేని చిరు వ్యాఖ్యలు'
ముప్పై సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో ఉన్న చిరంజీవి ఆ అన్నదాత కష్టాల మీద ఒక్క సినిమా అన్నా తీసి వారిలో చైతన్యం కలిగించారా? ఆ అన్నదాతకు కరువు వచ్చినప్పుడు కాని, వరదల్లో, ఉప్పెనల్లో పంట కొట్టుకుపోయి విలవిలలాడుతున్నప్పుడు కానీ కనీసం పలకరించి తన సామాజిక స్పృహను చాటుకున్నారా?... లేదు... పోనీ నేడు రాజకీయాల్లోకి వచ్చాక అయినా తన సొంత ప్రాంతం అయిన గోదావరి డెల్టాలో లక్షల ఎకరాలలో రబీ పంట ఎండిపోతుంటే కనీసం ప్రభుత్వం మీద ఆ రైతుల తరపున పోరాడుతున్నారా? వరికి గిట్టుబాటు ధర కోసం ఏనాడైనా పెదవి విప్పారా? అని ఎన్నారై టిడిపి మిచిగన్ కమిటీ సూటిగా ప్రశ్నించింది.
కానీ నేడు 'యువ'తాంధ్ర స్వశక్తితో, తల్లి తండ్రుల కష్టార్జితంతో ఉన్నత విద్యలు అభ్యసించి శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగువాడి కీర్తి ప్రతిష్టలను ప్రపంచపటంలో ఎగరేస్తుంటే చూసి మెచ్చుకుని ప్రోత్సహించాల్సింది పోయి, ఇంకా వారినే 'ఒక ముద్ద అన్నం పెట్టగలరా' అని అవహేళన చేయడం తగదని పేర్కొంది. ఇదేనా చిరంజీవి కోరుకుంటున్న మార్పు? అని నిలదీసింది.
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి స్ఫూర్తితో నేటి మన యువత అన్ని రంగాలలో ప్రపంచంతో పోటీ పడుతూ మన దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతుంటే చిరంజీవి ఇష్టారాజ్యంగా యువతను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని కమిటీ హెచ్చరించింది. స్వార్ధ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం అభివృద్ధి రంగాలను, అందుకు సహాయపడే వాళ్ళను కించ పరచవద్దని ఎన్నారై టిడిపి మిచిగన్ కమిటీ విజ్ఞప్తి చేసింది.
Pages: -1- 2 News Posted: 17 February, 2009
|