మన కోపమే మన మృత్యువు
ఈ అధ్యయనాన్ని లంపెర్ట్ బృందం మూడేళ్లపాటు నిర్వహించింది. కోపం ప్రాణాంతకమైనది, గుండెకు సంబంధించిన బలహీనతలు కలవారిలోనైతే ప్రాణాంతకంగా మారుతుందని లంపెర్ట్ తెలియజేశారు. గుండెలో విద్యుత్ వ్యవస్థను కోపం దెబ్బతీస్తుంది, దాంతో రక్త ప్రసరణకు తీవ్ర అంతరాయం కలిగి ప్రాణాంతకంగా మారుతుందని ఆ అధ్యయనం వెల్లడించింది. అయితే ఆరోగ్యకరమైన వారికి ఈ అధ్యయనాన్ని వర్తించడం పూర్తిగా సరికాదు. అమెరికాలో ఏడాదికి 4 లక్షల మంది ఆకశ్మికంగా గుండె పోటు వచ్చి మరణిస్తున్నారు. అయితే మన కోపం మన శత్రవు. బలహీనమైన గుండె కలవారికి ప్రాణాంతకంగా పరిణమిస్తే ఆరోగ్యకరమైన వారికి అనారోగ్య కారకంగా నిలుస్తుంది.
ఒక విషయాన్ని సవ్యంగా సమర్థించలేకపోతే సాధారణంగా వ్యక్తుల్లో కోపం వస్తుంది. అంటే కోపం అసమర్థతకు చిహ్నంగా గుర్తించాలి. కోపాన్ని సవ్యంగా నియంత్రిక గల్గితే అద్భుతమైన విజయాల్ని సాధించవచ్చు, అలా కాకపోతే అపజయాలను చవిచూడవచ్చు, అనారోగ్యం పాలు కావచ్చు. 'ప్రతి వారికి కోపం వస్తుంది. అయితే, సరైన వ్యక్తిపై, సరైన మోతాదులో, సరైన సమయంలో, సరైన కారణంపై, సరైన ప్రయోజనానికై, సరైన తీరులో కోపంగించుకోవడం అంత సులువైన విషయం కాదు.' అని ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ వ్యాఖ్యనించారు.
Pages: -1- 2 News Posted: 24 February, 2009
|