`తానా'షాల తగువు తీరింది..!
ప్రభాకర చౌదరిపై జయరాం వర్గం దాడిని ముమ్మరం చేసింది. ఆయన సంస్థ నిధులను దుర్వినియోగం చేశారని కొన్ని లెక్కలు బయటపెట్టారు. గవర్నింగ్ బోర్డు సమావేశం పెట్టి చౌదరిని పదవి నుంచి తొలగించారు. జయరాం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రభాకర చౌదరి తననుతాను అధ్యక్షుడిగానే చెప్పుకున్నారు. ఈ నేపధ్యంలో ఆయన సంస్థ పేరునుగానీ, లోగోనుగానీ వాడుకోకుండా నిలువరించాలంటూ జయరాం వర్గం టెక్సాస్ లో కేసు వేసింది. సభ్యత్వాల నమోదులో అవకతవకలు జరిగాయంటూ రవి మాదల మరికొందరితో కలిసి మేరీలాండ్ లో కేసు దాఖలు చేశారు.
ఈలోగా జయరాం కోమటి తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న తానా కార్యవర్గం ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ మొదటి వారానికి పూర్తవుతుంది. ఉన్న కేసులకు తోడు మరిన్ని కొత్త కేసులు ఎదురయ్యే పరిస్థితి తలెత్తడంతో మొత్తంమీద జయరాం, ప్రభాకర చౌదరి వర్గాలు రాజీకి వచ్చాయి. కేసులు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ రాజీ ఫార్ములా ప్రకారం... అతిత్వరలోనే ప్రభాకర చౌదరి మళ్లీ అధ్యక్షుడిగా నియమితులవుతారు. ఎన్నికల ప్రక్రియ ఆయన సారథ్యంలోనే పూర్తవుతుంది. జూలై ద్వైవార్షిక సదస్సు జయరాం వర్గం కోరిక మేరకు షికాగోలోనే జరుగుతుంది. ఎన్నికల తర్వాత జయరాం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.
ఇంతవరకు బాగానే ఉందికానీ, ఓర్లాండో సభావేదిక కోసం వదులుకున్న లక్షన్నర డాలర్ల సంగతి ఏమిటని తానాలో బాధ్యతాయుతమైన సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకాలం కోర్టు వివాదాల కోసం ఖర్చు చేసిన మొత్తం ఎవరు చెల్లిస్తారని పలువురు నిలదీస్తున్నారు. ఇరువర్గాల వివాదాలనూ, విచిత్ర మైత్రినీ నిరసిస్తూ... ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని తానా సీనియర్ సభ్యులు నిర్ణయించారు. 103 మంది ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. అధిపతుల రాజీతో వివాదం అంతమవుతుందో లేక ఆజ్యం పోసుకుంటుందో వేచిచూడాలి.
Pages: -1- 2 News Posted: 24 February, 2009
|