బెలూన్ లో పెళ్ళి!
బెలూన్ కు నిలకడ తీసుకువచ్చిన తరువాత కాబోయే దంపతులు బెలూన్ కింద బాస్కెట్ లోకి ప్రవేశించారు. నిర్ణీత సమయానికి గంట ఆలస్యంగా బెలూన్ పైకి లేచింది. 'మేము కొంత భయపడ్డాం. కాని వెనుకకు తగ్గకూడదని నిశ్చయించుకున్నాం' అని దేవ్ చెప్పాడు. వారి మొహాల్లో ఆందోళన కనిపించింది. వారు బెలూన్ తో బాస్కెట్ ను అనుసంధానించే పోల్స్ ను గట్టిగా పట్టుకు నిలబడ్డారు. కింద నేలపై ఉన్న వారి బంధువులు ఆనందంతో బిగ్గరగా కేకలు వేశారు. ఆ జంటలో భయాన్ని పోగొట్టడానికి వారు 'జై శ్రీ రామ్' అని, 'హర హర మహదేవ' దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. బెలూన్ ఒక్కసారిగా పైకి లేచి దాదాపు 70 అడుగుల ఎత్తుకు చేరగా వీక్షకులు ఆనందంతో చప్పట్లు కొట్టారు.
ఆ దట్టమైన వినీలాకాశంలో వేలాది తారాజువ్వలు కాంతులు వెదజల్లుతుండగా ఆ వధూవరులు పరస్పరం దండలు మార్చుకున్నారు. కొన్ని నిమిషాల అనంతరం వేద మంత్రోచ్ఛాటనల మధ్య అర్చన నుదుట దేవ్ తిలకం దిద్దాడు. ఆ విధంగా వారి పెళ్ళి తంతు ముగిసింది. వారిద్దరూ చేతులు కలిపి అతిథులు, బంధువులు, ఈ వినూత్న వివాహోత్సవాన్ని తిలకించేందుకు పిలవని పేరంటంగా వచ్చిన అతిథులపై పుష్పవర్షం కురిపించారు.
ఈ కార్యక్రమం చీఫ్ ఆర్గనైజర్, దేవ్ అంకుల్ ఆర్.పి. సేన్ తాము ముందుగా జిల్లా అధికార యంత్రాంగం నుంచి ఇందుకు అనుమతిని, 'నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్'ను సంపాదించామని తెలియజేశారు. 'ఈ ప్రతిపాదన ప్రత్యేకమైనది. సాహసంతో కూడుకున్నట్టిది. అయితే, ఆ దంపతులు క్షేమంగా కిందకు దిగి వచ్చిన తరువాత నేను కూడా ఉపశమనం పొందాను' అని ఆయన చెప్పారు.
దేవ్, అర్చన బాటలో సాహసం చేయాలని ఆకాంక్షించే వారు 20 నిమిషాల యాత్రకు రూ. 80 వేలు చెల్లించి అలా చేయవచ్చును. హాట్ ఎయిర్ బెలూన్ కింద ఉండే బకెట్ లో పైలట్ కాకుండా ముగ్గురికి చోటు ఉంటుంది.
అయితే, హిందువుల ఆచారం ప్రకారం వివాహ ప్రక్రియ సప్తపది లేకుండా పూర్తి కాదు కనుక ఆ దంపతులు కాక్ పిట్ లో నుంచి కిందకు దిగిన తరువాత నేరుగా తమ వివాహం కోసం ఎంపిక చేసిన వేదిక వద్దకు వెళ్ళారు.
Pages: -1- 2 News Posted: 27 February, 2009
|