'చిరుగాలి' ప్రభంజనం
ది ట్రూ పోల్ సర్వే ఫలితాలు ఇవీ :
1. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 123 అసెంబ్లీ స్థానాల్లోనూ 90 చోట్ల ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
2. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 119 స్థానాలకు గాను 80 నియోజకవర్గాల్లో విజయావకాశాలున్నాయి.
3. రాయలసీమలో అయితే, 52 నియోజకవర్గాలకు గాను 35 సీట్లకు పైగానే గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
మొత్తం మూడు ప్రాంతాల్లోనూ కలిపి 20 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీకి 50 నుంచి 60 శాతం వోట్లు పోలయ్యే అవకాశం ఉందని సర్వే తేల్చింది. మరో 40 చోట్ల పిఆర్పీకి 50 శాతం వోట్లు పడతాయి. 60 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యానికి అనుకూలంగా 45 నుంచి 50 శాతం వోట్లు పడతాయి. మరో 60 నియోజకవర్గాల్లో 35 నుంచి 45 శాతం మధ్యన ప్రజారాజ్యానికి అనుకూల వోట్లు పోలవుతాయి. మొత్తం మీద ప్రజారాజ్యం పార్టీకి 180 స్థానాలు విజయం సాధించేందుకు వోటర్లు సుముఖంగా ఉన్నట్లు సర్వేలో తేలిందని శ్రీనివాస మానాప్రగడ తెలిపారు.
ప్రజల బాగు కోసమే, వారి అభీష్టం మేరకే రాజకీయ ఉనికిలోకి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ స్వచ్ఛమైనదని, ప్రజా పార్టీ అని రాష్ట్రాభివృద్ధికి అవిరళ కృషి చేస్తుందని శ్రీనివాస మానాప్రగడ పేర్కొన్నారు. ప్రజారాజ్యం పార్టీ మీద ఆరోపణలు చేసే ముందు విపక్షాలు తమలో తాము ఒకసారి అవలోకించుకోవాలని శ్రీనివాస మానాప్రగడ విజ్ఞప్తి చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ రాజకీయాల్లోకి రావడంపైన శ్రీనివాస స్పందిస్తూ, ఆయన రాకతో రాజకీయాల్లో కూడా 'ఫిక్సింగ్' జరగవచ్చని, అజారుద్దీన్ నిలబడిన చోట మరో మంచి ప్రజా ప్రతినిధికి రావాల్సిన అవకాశాలను దొంగిలించినట్లవుతుందని వ్యాఖ్యానించారు. అజారుద్దీన్ సికిందరాబాద్, మల్కాజ్ గిరిలలోను ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలబడితే అక్కడి వోటర్లు మంచి గుణపాఠం తప్పకుండా చెబుతారని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి శ్రీనివాస మానాప్రగడ తెలిపారు.
జనవరి నెలలో నిర్వహించిన యోగేష్ యాదవ్, సిఎస్ డి ఎస్ నిర్వహించిన అసత్య పోల్ సర్వేను వోటర్లు అస్సలు పరిగణనలోకే తీసుకోరని తన ప్రకటనలో శ్రీనివాస స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి లేదా ఎవరికి అధికారం అప్పగించాలన్న తుది ఫలితం వోటర్ల అభిమతంపైనే ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ 180 నుంచి 200 స్థానాల్లో విజయబావుటా ఎగరేసి సంపూర్ణ మెజారిటీని సాధించి రాష్ట్రం పరిపాలన పగ్గాలను చేపట్టడం తథ్యమని ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ పూర్తి విశ్వాసంతో ఉందని వెల్లడించారు.
Pages: -1- 2 News Posted: 3 March, 2009
|