నేతలు ఒకటి, తానా రెండు
ఈ సమావేశంలో నాట్స్ వ్యవస్థాపక సభ్యులు రవీంద్ర ఆలపాటి, రవి కోనేరు, వీరయ్య చుండు, రామకృష్ణ లక్కంసానినాగభూషణం పొట్ల, మధు కొర్రపాటి, మల్లికార్జున రావు చలసాని, శ్రీనివాస్ లావు, నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, మురళి సజ్జ, శ్రీనివాస రావు కొడాలి, శ్రీనివాస్ కోనేరు. విష్ణు వీరపనేని, ధ్రువ చౌదరి నాగండ్ల, శేషుబాబు, శ్రీధర్ తాళంకి తదితరులు పాల్గొన్నారు. జూలై 2 నుంచి మూడు రోజులపాటు ఓర్లాండోలోని ఆరెంజ్ కౌంటీ కన్వెన్షన్ సెంటర్ లో మొదటి జాతీయ మహాసభలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది.
అమెరికా తెలుగు సంబరాలు పేరుతో జరిగే ఈ సభల కోసం షికాగోలో జరిగిన నిధి సేకరణకు భారీగా విరాళాలు వచ్చాయి. రవి ఆచంట, ప్రవీణ్ మోటూరు, శివ చౌదరి చెన్నుపాటి, ఫణి రామినేని, వేణు కోడూరు, విజయ్ వెనిగళ్ల, కృష్ణ అడుసుమిల్లి, విజయ్ గన్నె, శ్రీనివాస్ చుండు, ప్రసాద్ తాళ్లూరు, మహేశ్ కాకరాల తదితరులు ఉదారంగా విరాళాలు ఇవ్వడంతో తెలుగు సంబరాల కోసం, సంస్థ నిర్వహణ కోసం 2,53,008 డాలర్ల నిధి సమకూరినట్లు నాట్స్ వ్యవస్థాపక సభ్యుడు శ్రీధర్ అప్పసాని ఒక ప్రకటనలో తెలిపారు. మాతృభూమిలో సేవాకార్యక్రమాలు నిర్వహించడం మంచిదే అయినప్పటికీ అమెరికాలోని తెలుగువారి ప్రయోజనాలు కాపాడడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ఇప్పటిదాకా తెలుగు సంఘాల మహాసభలకు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయ నాయకులను ఆహ్వానించేవారని, దానివల్ల ఆయా సంస్థల సారథుల సొంత ప్రయోజనాలు నెరవేరడం మినహా ఒరిగిందేమీ లేదని అన్నారు. మెడికల్ ఇన్స్యూరెన్స్ లేనివాళ్లకు, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు, పిల్లల దగ్గరికి వచ్చి అనారోగ్యం బారినపడే తల్లిదండ్రులకు, ఉద్యోగాల వేటలో కొత్తగా అమెరికా వచ్చి ఇబ్బందులకు గురవుతున్న వాళ్లకు అండగా నిలవాలని నాట్స్ ఆకాంక్షిస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 3 March, 2009
|