షుగర్ మందుల దుర్వినియోగం
రెపాగ్లైనైడ్-
అదే విధంగా స్వల్ప కాలంలో వేగంగా పనిచేసే డయోబెటిక్ మందు రెపాగ్లైనైడ్ కూడా భారత దేశంలో చాలా దుర్వినియోగమవుతోంది. తక్కువ సమయాల్లో ఆహారాన్ని తీసుకునే ముందు ఈ మందును ప్రజలు తరచూ వాడుతుంటారు. దీర్ఘకాలం ఆహారం తీసుకోని సందర్బాల్లో ఈ మందును వినియోగించరు. చిరు తిండి తినడానికి ముందు కూడా ఈ మందును వాడుతారు. రెపాగ్లైనైడ్ ను అతిగా వాడితే తలతిరిగుడు, ఆందోళన, చలవలు కమ్మడం, కోమా లాంటి స్థితికి చేరుకోవచ్చు.
బయెట్టా-
అదే విధంగా ప్రజలు దుర్వినియోగం చేసే మరో మధుమేహ మందు బయెట్టా (byetta) నాలుగేళ్ల క్రితం ఈ మందును ఇంజెక్షన్ గా కూడా తయారు చేశారు. భారత దేశంలో ఈ ఇంజెక్షన్లు 2007లో విడుదలైనాయి. బయెట్టా మందును 'డైట్ పిల్'గా చాలా విస్తృతంగా వినియోగిస్తున్నారు. టైప్ 2 డయోబెటిస్ కోసం ఈ మందును వినియోగిస్తారు. దాదాపు 30 కేజీల దాకా బరువును ఈ మందు ద్వారా తగ్గించేందుకు వీలుంటుంది. 4-6 నెలలపాటు ఈ మందు వాడితే 5-6 కెజిల దాకా బరువు తగ్గుతుంది. దాంతో ఈ మందు వాడకం దేశంలో పెరిగిపోయింది. బయెట్టా సాధారణ బ్లడ్ షుగర్ ఉండే వ్యక్తుల్లో బరువు తగ్గేందుకు ఉపయోగపడదని ఆ మందును కనుగొన్న కంపెనీ ప్రకటించింది.
Pages: -1- 2 News Posted: 5 March, 2009
|