జీతం ఇస్తేనే సంసారం!
'ఇంటిని చక్కదిద్దడంలో సగటు మహిళ తోటి పురుష ఉద్యోగి కన్నా రోజూ కనీసం ఐదు గంటలు అధికంగా పని చేస్తుంటుంది. అంతే కాకుండా మౌనంగా ఆమె పని చేసుకుపోతుండడం వల్ల పురుషులు మరింతగా పని చేయగలుగుతుంటారు. అతని సామర్థ్యానికి, ఉత్పాదకత స్థాయికి తగినట్లుగా పరిహారం చెల్లిస్తుంటారు. అందువల్ల ఆమెకు కూడా తగిన విధంగా పరిహారం చెల్లించవలసిన ఆవశ్యకత ఉంది' అని ప్రముఖ మహిళా హ క్కుల నాయకురాలు వి. జుహ్రా సంఘం తొలి సమావేశంలో ప్రసంగిస్తూ సూచించారు. పూర్తిగా వేతనాలు కాకపోయినప్పటికీ కనీస వేతనం చెల్లించవచ్చునని, స్త్రీ, పురుషుల మధ్య అవరోధాలను తొలగించడానికి ఇది దోహదం చేయగలదని ఆమె అన్నారు.
శ్రీ వేది, నిశ, నీతి వేది, జీవన వంటి ప్రముఖ హక్కుల సంఘాలు ఈ సంస్థకు తమ మద్దతు ప్రకటించాయి. కొత్త సంఘాన్ని లాంఛనంగా ఏర్పాటు చేయడానికి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఒక సదస్సును నిర్వహించనున్నారు. 'వారి సేవలను నిజంగా పరిగణనలోకి తీసుకుంటే దేశీయ ఉత్పత్తిలో దాదాపు 50 శాతం వరకు ఉంటుంది. అయినప్పటికీ, మహిళలు జీతం, నోరు లేకుండా పని చేస్తున్నారు. 'జీతం లేకుండా' అందిస్తున్న సేవలను ఎవరూ మన్నించడం లేదు, ఖాతరు కూడా చేయడం లేదు' అని మహిళా హక్కుల నాయకురాలు సులోచనా రామకృష్ణన్ పేర్కొన్నారు.
Pages: -1- 2 News Posted: 9 March, 2009
|