సగం మంది బాల వధువులే!
బియుఎస్ పిహెచ్ (బస్ఫ్) అంచనాల ప్రకారం ప్రతి అయిదు మంది వివాహిత స్త్రీలల్లో ఒకరు అంటే 22.6 శాతం మంది 16 ఏళ్ల లోపు పెళ్లాడుతుంటే, 13 ఏళ్ల లోపు ఆడపిల్లలు 2.6 శాతం పెళ్లి చేసుకుంటున్నారు. 18 ఏళ్ల లోపు పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు ఎలాంటి గర్భనిరోధక సాధనాల్ని వాడినట్లు దాఖలాలు లేవు. పెళ్లి చేసుకున్న బాలికల్లో దాదాపు 48.4 శాతం మంది 18 ఏళ్ల లోపే శిశువులకు జన్మనిస్తున్నట్లు ఆ అధ్యయనం తెలియజేసింది. మైనారిటీ తీరిన తర్వాత వివాహం చేసుకున్న మహిళ్లల్లో స్టెరిలైజేషన్ రేటు 4.6 శాతంగా ఉంటే, మైనారిటీ తీరకుండా వివాహం చేసుకున్న మహిళల్లో స్టెరిలైజేషన్ 19.5 శాతంగా ఉంది.
బాల వధువుల్లో 'ఫిస్టులా' సమస్య చాలా ప్రాణాంతకంగా పరిణమించింది. యోని మార్గంలో చీలిక సమస్యను ఫిస్టులాగా పిలుస్తారు. అదే విధంగా వారు గర్భధారణ సమస్యలు, ప్రసవ సమయాల్లో మరణం లాంటి పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. 1929లో బాల్య వివాహ చట్టం తెచ్చినపుడు పెళ్లి వయసును 12 ఏళ్లుగా అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించింది. 1978లో తిరిగి చట్టపరమైన వివాహ వయసును 18 ఏళ్లుగా భారత ప్రభుత్వం నిర్ణయించింది. బాల్య వివాహాల కారణంగా భారత్ ప్రసవ మరణాలు, శిశు మరణాలు సంభవిస్తున్నాయని యునిసెఫ్ తెలిపింది. 15 ఏళ్లు వయసున్న స్త్రీలు ప్రసవ సమయంలో మరణించడం కంటే, 20 ఏళ్ల వయసున్న స్త్రీలు ప్రసవ సమయంలో మరణించడం చాల తక్కువ. అదే విధంగా మైనారిటీ తీరని వారి కలిగే సంతానంలో అధికంగా శిశుమరణాల రేటు ఉన్నట్లు ఆ అధ్యయనం తెలిపింది.
ప్రపంచంలో జరిగే బాల్య వివాహాల్లో 40 శాతం కంటే ఎక్కువగా భారత్ లో జురుగుతున్నాయి. 20-24 ఏళ్ల వయసున్న ఆడవాళ్లలో 6 కోట్లమంది దాకా 18 ఏళ్ల లోపే వివాహం చేసుకున్నట్లు ఆ అద్యయనం వెల్లడించింది. శారీరకంగా, మానసికంగా పరిపక్వత సాధించడానకి ముందుగానే చాలా మంది మైనార్ బాలికలు ప్రసవిస్తున్నట్లు యునిసెఫ్ తెలిపింది.
Pages: -1- 2 News Posted: 11 March, 2009
|