త్వరలో స్క్రాచ్ ప్రూఫ్ కార్లు!
తమకు తాము మరమ్మతు చేసుకోగల పదార్ధాల గురించి ఇంజినీర్లు శతాబ్దాలుగా కలలు కనేవారు. మానవుల చర్మం, కణజాలం దెబ్బతిన్నపుడు ఎలాగైతే తమకు తాము మరమ్మతు చేసుకోగల స్వభావం పట్ల పలువురు ఇంజనీర్లు స్పూర్తిగా తీసుకుని కృషి చేశారు. కొన్ని పదార్ధాలకు టన్నల్స్ నెట్ వర్క్ లేదా నానో కణాలను 'స్రవించే' స్వభావాన్ని కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ పదార్ధాలు విరిగిన సమయంలో గాని, వాటి పై గీతలు పడిన సమయంలో గాని ఆ పదార్ధం వాటిని పూడ్చుకునేందుకు కొన్ని నానో కణాలను స్రవించే విషయాన్ని వారు కనుగొన్నారు. ఇప్పటి వరకు ఉనికిలో ఉన్న పదార్ధాలన్ని చాలా సంక్లిష్టమైనవి, చాలా ఖరీదైనవి. అయితే శుక్రవారం నాడు 'సైన్స్' జర్నల్ లో వెలువడిన కథనంలో సూచించిన స్వయం స్వస్థత చేకూర్చుకునే రసాయనం చాలా సులువైనది, చౌకైనది.
ప్లాస్టిక్స్, ఫోమ్స్, ఫిల్మ్స్ లో వాడే పాలీయూరిథేన్ పైపూతలో ఉండే 'చితోసాన్' అనే రసాయనం పీతలు, నత్తలు, రొయ్యల నుండి వెలికితీస్తారు. అదే విధంగా 'ఆక్సిటేన్స్' అనే జీవ రసాయనిక పదార్ధం వాటిపై రింగ్స్ లా ఉంటాయి. ఈ రసాయనిక పదార్ధాన్ని స్క్రాచ్ ప్రూఫ్ పూతగా వాహనాలపై వాడాలని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పూత పూసిన వాహనాలపై గీత పడిన సమయంలో ఆ రసాయనిక పూతలో ఉండే ఆక్సిటేన్స్ రింగ్స్ విరిగి పోయి రసాయనికంగా ప్రతిక్రియ జరిగే ప్రదేశాలకు చేరుతాయి. సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావయెలెట్ కిరణాలు 'చిటోసన్' అణువులను విడగొట్టి మరో రియాక్టివ్ సైట్స్ ను ఏర్పరస్తుంది. రింగ్స్ లోని ఆక్సిటేన్, సూర్యరశ్మి ద్వారా వెలువడే చిటోసన్ రసాయనిక పదార్ధాలు రెండూ పరస్పరం ఆకర్షితమై గీతలను మాయం చేస్తాయి.
ఈ పదార్ధం ద్వారా వాహనాల పెయింట్లలోను, పారదర్శకంగా కనిపించే ప్లాస్టిక్ పూతలా స్రీన్లపైన, గ్లాసుల పైన, వాచ్ లపైన వినియోగించవచ్చు. గీతల మరమ్మతు వేగం ఎండ తీవ్రతపై ఆధారపడి ఉంటుందని ఆ శాస్త్రవేత్తలు తెలియజేశారు. బ్రిటన్ లోని ప్రత్యేక వాతావరణంలో కంటే మధ్యధరా ప్రాంతంలోని ఒక రకమైన వెచ్చటి వాతావరణంలో గీతలు చాలా వేగంగా మాయమైపోతాయి. అయితే వాతావరణ పరిస్థితుల తారతమ్యత రిపేర్ ప్రక్రియను దెబ్బతీయవని సైన్స్ జర్నల్ పేర్కొంది. అయితే ఈ కోటింగ్ ఒకేఒకసారి పనిచేస్తుంది. ఒకే ప్రాంతంలో మరో సారి గీత పడితే అది అలానే ఉండిపోతుంది. ఈ రసాయనిక పదార్ధం పై మరిన్ని పరిశోధనలు జరుగవలసి ఉందని ఆ శాస్త్రవేత్తలు తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 13 March, 2009
|