'ఒబామా జుట్టు నల్లబరుస్తా'
72 సంవత్సరాల జాన్ మెక్ కెయిన్ తో ఎన్నికల పోరు సాగిస్తున్న సమయంలోనే హఠాత్తుగా ఒబామా జుట్టుకు నెరపు వచ్చింది. దీనితో యువకుడైన ఆ అధ్యక్షుడు రాజకీయాలలో రాటుదేలినట్లుగా కనిపించడానికి జుట్టుకు రంగు వేస్తున్నారనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అయితే, 17 సంవత్సరాలుగా ఆయనకు వ్యక్తిగత క్షురకునిగా వ్యవహరిస్తున్న జరీఫ్ ఆ వదంతులను ఖండించారు. తాను ఒబామా జుట్టుకు ఎన్నడూ రంగు వేయలేదని, 'నూటికి నూరు పాళ్ళూ ఇది నిజం' అని జరీఫ్ స్పష్టం చేశారు.
కాగా, మనిషికి జుట్టు ఎందుకు నెరుస్తుందనే విషయమై రకరకాల సిద్ధాంతాలు వ్యాప్తిలో ఉన్నాయి. యూరోపియన్ సైంటిస్టుల బృందం క్రితం వారం తాజాగా ఒక సిద్ధాంతాన్ని వెలువరించారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ కేశాల కుదుళ్ళు బాగా ఒరిపిడికి గురవుతాయని, దీనితో హైడ్రోజన్ పెరాక్సైడ్ విస్తృతంగా పేరుకుపోతుందని, ఇది మెలానిన్ సంలీనాన్ని అడ్డుకుంటుందని, ఫలితంగా జుట్టు నెరుస్తుందని వారు వివరించారు.
Pages: -1- 2 News Posted: 17 March, 2009
|