తానా సభల తారాగణం
నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో తోడ్పడిన వారందరికీ ప్రభాక చౌదరి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలి పరిణామాలకుగాను మోహన్ నన్నపనేని క్షమాపణ చెప్పారు. సంస్థ ప్రయోజనాల కోసం తాము ఏకమై ముందుకు సాగుతున్నామని తెలిపారు. గత ఏడాది కాలంలో తానా ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలను లోకేశ్వర రావు వివరించారు. ఫౌండేషన్ వివిధ ప్రాజెక్టుల కోసం 2.5 లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మహాసభలకు ఇల్లినాయ్ గవర్నర్ ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ఆహ్వానించనున్నట్లు యుగంధర్ ఈ సమావేశంలో తెలిపారు. మహాసభలలో సుప్రసిద్ధ గాయకుడు బాలసుబ్రమణ్యానికి జీవితకాల సాఫల్య పురస్కారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక మహాసభలకు ఎన్టీఆర్, చార్మిలతో పాటు మురళీమోహన్, ఇవివి సత్యనారాయణ, అల్లరి నరేశ్, రామ్, స్వాతి, రాజీవ్ కనకాల, సుమ, ఉత్తేజ్, రఘుబాబు హాజరు కానున్నట్లు కాశి తెలియజేశారు. సినిమా గీత రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, సుద్దాల, గోరటి వెంకన్న, గాయకుడు మనో కూడా తానా మహాసభలకు అతిథులుగా వస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవి శంకర్ ను మహాసభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ఆద్యాత్మిక కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు కాశి తెలిపారు.
Pages: -1- 2 News Posted: 20 March, 2009
|