బాటా ఉగాది వేడుకలు
విరోధి నామ సంవత్సరం ఉగాది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కూచిపూడి నృత్యం, సినిమా డ్యాన్స్ లకు అతిథులు ఆనందంతో చప్పట్లతో తమ హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఈ ఉహగాది ఉత్సవాల్లో 'వరల్డ్ డ్యాన్సెస్' అనే సరికొత్త కార్యక్రమాన్ని ప్రదర్శించారు. అనంతరం 'బాబోయ్ ఎలక్షన్స్' అనే హాస్యనాటికను ప్రదర్శించారు. 'చీచీ ఎకానమీ', కామెడీ టిట్ బిట్స్ ప్రదర్శన కూడా అందరినీ అలరించాయి. పలు ప్రముఖ సినిమా పాటలకు చిన్నారులు చేసిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విరోధి నామ ఉగాది ఉత్సవాల్లో ఓ ప్రత్యేకత ఉంది. బాటా కమిటీ సభ్యులు పలువురు కళాకారులుగా ఆహూతులను అలరించారు.
బాటా అధ్యక్షునిగా పదవీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న రవి తిరువీధుల ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాటా సంస్థ నిర్వహణలో తెలుగు సోదర సోదరీమణుల నుంచి తనకు చక్కని సహాయ సహకారాలు లభించాయని కృతజ్ఞతలు తెలిపారు. బాటా కార్యక్రమాలు విజయవంతం కావడంలో వీరు వుప్పల, కరుణ్ వలిగేటి అందించిన సహాయం ఎనలేనిదని ధన్యవాదాలు తెలిపారు. 2009 - 10 సంవత్సరానికి గాను ఎన్నికైన బాటా కమిటీ సభ్యులను రవి తిరువీధుల పరిచయం చేశారు. ప్రసాద్ మంగిన బాటా అధ్యక్షునిగా, శ్రీలు వెలుగేటి ఉపాధ్యక్షునిగా శ్రీనివాస్ కొల్లి కార్యదర్శిగా, శ్రీని మంగిపూడి కోశాధికారిగా, రమేష్ కొండా సంయుక్త కార్యదర్శిగా, విజయ ఆసురి, వెంకట్ మల్లాది, కామేష్ మళ్ళ, శిరీష బత్తుల కమిటీ సభ్యులుగా నామినేట్ అయ్యారు.
బాటా కొత్త అధ్యక్షునిగా ఎన్నికైన ప్రసాద్ మంగిన జయరామ్ కోమటి, రమేష్ మందలపు, యుగంధర్ కాకర్ల, రవి తిరువీధుల, విజయ ఆసురి, వీరు వుప్పల తమకు అందించిన సహాయ సహకారాలకు గాను ధన్యవాదాలు తెలిపారు. బాటా కార్యక్రమాల సక్సెస్ లో పాలుపంచుకుంటున్న వలంటీర్లు, ప్రముఖులు, సభ్యులు అందరికీ రవి, ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఉగాది ఉత్సవాల కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన రవి ట్యాక్స్ సర్వీసెస్ కు చెందిన రవి, రాజి గొండిపల్లి, చానెల్ రియల్ ఎస్టేట్ అండ్ మార్టిగేజ్ సంస్థకు చెందిన గోపిరెడ్డి, పిఎన్ జి జువెలర్స్ సంస్థకు చెందిన విశాఖ, రెమిట్ 2 ఇండియా డాట్ కామ్ కు చెందిన గురుదీప్ సూరి, నమస్తే ప్లాజాకు చెందిన హరిబాబుకు నిర్వాహకులు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. యూత్ షోలో విజేతలకు బహుమతులు, మెడల్స్ ప్రదానంతో బాటా విరోధి నామ సంవత్సరం ఉగాది వేడుకలు ఆనందంగా ముగిశాయని రమేష్ కొండ తన ప్రకటనలో తెలిపారు.
Pages: -1- 2 News Posted: 31 March, 2009
|