టిడిపి ఆవిర్భావ దినోత్సవం
తెలుగుదేశం పార్టీ విధానాలు, సూత్రాలను మరింతగా ముందుకు తీసుకుపోవడానికి తమ సహాయ సహకారాలు కొనసాగిస్తామని, టిడిపిని మళ్ళీ అధికారంలోకి తెచ్చేందుకు కావాల్సిన కృషి చేస్తామని అమెరికాలోని టిడిపి నాయకులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం ద్వారా తెలుగుదేశం పార్టీ తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకువచ్చిందని వారంతా గుర్తు చేసుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీకి అధికారం అందించేందుకు ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా ప్రచారం చేయాలని ప్రవాసాంధ్రులందరికీ టిడిపి తరఫున ఉత్సవాల నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
టిడిపి తరఫున ఉధృతంగా ప్రచారం చేస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన నందమూరి యువ సింహం జూనియర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు. తరువాత యువరత్న నందమూరి బాలకృష్ణపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు. సుమారు 8 వందల మంది తెలుగుదేశం అభిమానులు, సానుభూతిపరులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొంత మంది అభిమానులైతే 2 వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి హరనాథ్ దొడ్డపనని, శైలజ అడ్లూరు కో ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. ప్రవాసాంధ్ర ప్రముఖులు హరి తుమ్మల, దాము గేదల, కొసరాజు సారథి, ప్రసాద్ కనగల, మోహన కృష్ణ మన్నవ, రవి పొట్లూరి కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. బాబాహట్ కు చెందిన వాసిరెడ్డి ప్రదీప్, దక్షిణ్ రెస్టారెంట్ కు చెందిన సతీష్ దాసరి చక్కని రుచికరమైన ఆహారాన్ని సరఫరా చేశారు. తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న రవి పొట్లూరి, మోహన కృష్ణ మన్నవ, సాంబయ్య కోటపాటి, బాల కరణం, సురేష్ పర్చూరి, పద్నిని కరణం, రత్న కొసరాజు, విజయశ్రీ, అనిల్, రాంబాబు, ప్రదీప్, రమేష్, ప్రసాద్, కృష్ణ తదితరులు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో చక్కని సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమణ గన్నెను తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అభినందించారు. కార్యక్రమం ముగియడానికు ముందు 'పుణ్యభూమి నా దేశం నమో నమామి' అనే పాట పాడిన గాయకుడు పార్థసారథికి ఆహూతులంతా స్టాండింగ్ ఒవేషన్ అందించారు. భారత జాతీయ గీతం 'జనగణమన'తో తెలుగుదేశం 27వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమాలు ముగిశాయి.
Pages: -1- 2 News Posted: 31 March, 2009
|