'గీత'లో కృష్ణుడి అద్భుతం
అనంతరం రామకృష్ణ తెలుగు నాటకం గురించి సవివరమైన ప్రసంగం చేశారు. శ్రీకృష్ణ రాయబారం నాటకంలోని 'జెండాపై కపిరాజు'. 'సంతోషమ్మున సంధి సేయుదురే' పద్యాలను కర్ణపేయంగా వినిపించారు. కాళ్ళకూరి నారాయణరావు రచించిన 'చింతామణి' నాటకంలోని బిల్వమంగళుని పద్యాలను, బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన 'సత్య హరిశ్చంద్ర' నాటకంలోని పద్యాలను శ్రావ్యంగా ఆలపించి అందరి మన్ననలు అందుకున్నారు. 'సత్యభామ గర్వభంగం' నాటకంలో నుంచి కూడా కొన్ని పద్యాలను తన కంచుకంఠంతో పాడారు.
తెలుగు నేలలో బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ అక్కిరాజు సుందర రామకృష్ణను గీత సంస్థ ఘనంగా సన్మానించింది. గీత ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర అజయ్ పొనుగోటి, కోశాధికారి హరిష్ కాంతాల డాక్టర్ అక్కిరాజుకు మొమెంటో అందజేశారు. 'కళా ప్రవీణ' బిరుదును సాహిత్య గీత అధ్యక్షుడు డాక్టర్ డిహెచ్ ఆర్ శర్మ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సభా భవనంలోని మొత్తం అతిథులంతా లేచి నిలబడి హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. రామకృష్ణకు డాక్టర్ రంగనాథ్ వేదాల, రాజ్ రావు, రాము చింతల శాలువ కప్పి సన్మానించారు.
అనంతరం ఆహూతులందరికీ సాంప్రదాయ బద్ధమైన కమ్మని అల్పాహారం ఏర్పాటు చేశారు. లక్ష్మి గరిమెళ్ళ, సూర్య ద్వాదశి, కృష్ణకుమారి వేదాల, ప్రవీణ వేమూరి, శారద కాసరబాద ఈ కమ్మని విందును ఏర్పాటు చేశారు.
Pages: -1- 2 News Posted: 13 May, 2009
|